న్యూఢిల్లీ : అవకాశాలు, వనరులు అందిరాకున్నా ఈ ప్రపంచంలో టాలెంట్‌కు కొదవలేదని సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది చాటుతున్నారు. వ్యర్ధ పదార్ధాలు, ఖాళీ పాత్రలతో చేసిన డ్రమ్స్ వాయిస్తున్న బాలుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రాంలో షేర్ అయిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. జిజన్ టాంగ్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో చిన్నారి డ్రమ్స్ వాయిస్తూ కనిపించాడు. వాద్య పరికరాలు లేకపోవడంతో ఆ బాలుడు వ్యర్ధ పదార్ధాలు, ఖాళీ పాత్రలతో చేసిన డ్రమ్స్‌ను ఉపయోగించాడు.
బాలుడి టాలెంట్‌ను పలువురు యూజర్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 4.3 కోట్ల మంది వీక్షించారు. ఈ ప్రపంచంలో అత్యున్నత నైపుణ్యాలు ఎవరూ గమనించకుండా పోతున్నాయని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఎవరైనా ఈ బాలుడికి డ్రమ్సెట్ సమకూర్చండని మరో యూజర్ కోరారు.