Viral Video | కార్లలో సాధారణంగా కుక్క పిల్లలను తీసుకెళ్లడం చూశాం. ముందు, వెనుక సీట్లలో శునకాలను కూర్చోబెట్టుకుని చాలా మంది వెళ్తుంటారు. కానీ ఒకాయన మాత్రం తన కారులో ఎవరూ ఊహించని విధంగా మృగరాజును తీసుకెళ్లాడు. తన కారు వెనుక సీట్లో పిల్లల మధ్య 8 నెలల సింహం పిల్లను కూర్చోబెట్టుకుని షికారుకు వెళ్లాడు. ఇక సింహం పిల్లను చూసిన ఇతర వాహనదారులు, పాదచారులు ఆ కారు వద్దకు పరుగెత్తుకొచ్చారు. దాంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఆ సింహం పిల్ల పేరు ముఫాసా అని పెట్టినట్లు దాని యజమాని తెలిపాడు. అయితే ఈ దృశ్యం పాకిస్తాన్లో వెలుగు చూసింది. సింహం పిల్లకు సంబంధించిన వీడియోను ఉంబ్రీన్ ఇబ్రహీం అనే వ్యక్తి తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు.
View this post on Instagram
A post shared by Umbreen Ibrahim Photography – Ambreen Razvi (@umbreenibrahimphotography)