Leave Niger | నైజర్‌ను త్వరగా విడిచి వెళ్లండి.. భారత పౌరులకు విదేశాంగ శాఖ సూచన
Leave Niger | ఆఫ్రికా దేశమైన నైజర్‌ను వీలైనంత తర్వగా విడిచి వెళ్లాలని (Leave Niger) అక్కడి భారత పౌరులకు విదేశాంగ శాఖ సూచించింది. అలాగే అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు పునరాలోచించుకోవాలని కోరింది.
న్యూఢిల్లీ/ నియామీ: ఆఫ్రికా దేశమైన నైజర్‌ను వీలైనంత తర్వగా విడిచి వెళ్లాలని (Leave Niger) అక్కడున్న భారత పౌరులకు విదేశాంగ శాఖ సూచించింది. అలాగే అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు పునరాలోచించుకోవాలని కోరింది. నైజర్‌లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఒక సూచన జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. నైజర్‌లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉండాల్సిన అవసరం లేని భారత పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని సూచించారు.
కాగా, ప్రస్తుతం నైజర్ గగనతలాన్ని మూసివేశారని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల గుండా వెళ్లే వారు భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే నైజర్కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వారు పునరాలోచించుకోవాలని అన్నారు. ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని కోరారు. నైజర్‌లో సుమారు 250 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు. వారంతా భారత ఎంబసీలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. భారతీయులు సురక్షితంగా ఆ దేశాన్ని వీడేందుకు భారత ఎంబసీ తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.
మరోవైపు నైజర్‌లో జూలై 26న సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను ఆర్మీ నిర్బంధించింది. అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది. అయితే సైనిక తిరుగుబాటుపై ఆ దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. శాంతి ఒప్పందాలకు ఆర్మీ చీఫ్ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ తిరుగుబాటు నాయకుడు, రాజకీయ నేత రిస్సా అగ్ బౌలా, సైనిక ప్రభుత్వంపై ఉద్యమం ప్రారంభించారు. అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తామని బుధవారం బహిరంగ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వర్గానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫర్ రిపబ్లిక్ (సీఆర్ఆర్) ఫోర్స్, ఆర్మీ మధ్య పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నైజర్‌లో ఉన్న భారతీయులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

