న్యూఢిల్లీ: లాటిన్ అమెరికాలో కరోనా మహమ్మారి ధాటికి 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వల్ల లాటిన్ అమెరికా దేశాల్లో ఇప్పటివరకు 15,00,350 మంది మృతిచెందగా, 4 కోట్ల 50 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఎక్కువగా బ్రెజిల్లో 6 లక్షల మంది మరణించారు. కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వల్ల 7,32,476 మంది మృతిచెందారు. ఇక మెక్సికో, పెరూ, కొలంబియా, అర్జెంటీనా దేశాల్లో అత్యధిక మరణాలు సంభవించాయి.
ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల 79 లక్షల 69 వేల 872 మంది కరోనాబారిన పడగా, 4,85,327 మంది మృతిచెందారు. ఇందులో అమెరికాలో అత్యధిక కేసులు నమోదవగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది. బ్రెజిల్, బ్రిటన్, రష్యా, టర్కీ, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.