Latam Flight Loses Altitude | అకస్మాత్తుగా ఎత్తు కోల్పోయిన విమానం.. 50 మంది ప్రయాణికులకు గాయాలు
Latam Flight Loses Altitude | ఆకాశంలో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా ఎత్తు కోల్పోయింది. విమానంలోని ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. సుమారు 50 మంది గాయపడ్డారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న పది మందిని అనంతరం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.
సిడ్నీ: ఆకాశంలో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా ఎత్తు కోల్పోయింది. విమానంలోని ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. సుమారు 50 మంది గాయపడ్డారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న పది మందిని అనంతరం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. (Latam Flight Loses Altitude) సోమవారం చిలీ దేశానికి చెందిన ఎయిర్‌లైన్ సంస్థ లాటమ్ విమానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి న్యూజిల్యాండ్‌లోని ఆక్లాండ్‌కు బయలుదేరింది. గాలిలో ఎగురుతున్న విమానం ఉన్నట్టుండి ఎత్తు కోల్పోయింది. దీంతో భారీగా కుదుపులకు గురైంది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది తమ సీట్ల నుంచి ఎగిరిపడ్డారు. కొందరు విమానం రూఫ్‌కు గుద్దుకున్నారు. ఈ సంఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
కాగా, ఆ విమానం సోమవారం సాయంత్రం ఆక్లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. తీవ్రంగా గాయపడి పరిస్థితి సీరియస్‌గా ఉన్న ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. విమానం ఫ్లోర్లో రక్తం మరకలు కనిపించాయని, తాము చాలా భయాందోళన చెందామని కొందరు ప్రయాణికులు తెలిపారు. మరోవైపు సాంకేతిక సమస్య వల్ల విమానం ఎత్తు కోల్పోయి భారీ కుదుపులకు గురైందని లాటమ్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

