తైవాన్ అధ్యక్షుడిగా లై
తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్-తే (64) సోమవారం బాధ్యతలు చేపట్టారు. గత నాలుగేండ్లపాటు తైవాన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. త్సై ఇంగ్-వెన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
- ‘వేర్పాటువాది’గా పరిగణిస్తున్న చైనా
తైపీ: తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్-తే (64) సోమవారం బాధ్యతలు చేపట్టారు. గత నాలుగేండ్లపాటు తైవాన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. త్సై ఇంగ్-వెన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. జపాన్ వలసరాజ్య కాలంలో సెంట్రల్ తైపీలో నిర్మించిన అధ్యక్ష కార్యాలయంలో లై ప్రమాణ స్వీకారం చేశారు. తైవాన్ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాను నిలువరించడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి.
తైవాన్ సార్వభౌమాధికార దేశంగా కొనసాగడంపై ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా లైని వేర్పాటువాదిగా పరిగణిస్తున్నది. కానీ, తైవాన్ అధ్యక్షునిగా లై తన తొలి ప్రసంగంలోనే చైనా పట్ల సుహృద్భావాన్ని వ్యక్తం చేశారు. చైనాతో శాంతిని కోరుకుంటున్నట్టు తెలిపారు. స్వయంపాలనతో ముందుకు సాగుతున్న తైవాన్‌పై సైనిక బెదిరింపులను ఆపాలని చైనాకు విజ్ఞప్తి చేశారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా శాంతిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Japan
- Lai Ching-te
- Taiwan
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

