Taiwan Minister: భారతీయులపై కామెంట్.. క్షమాపణలు చెప్పిన తైవాన్ మంత్రి
Taiwan Minister: తైవాన్ మంత్రి హూ మింగ్ చున్ భారతీయులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈశాన్య భారత్‌కు చెందిన ప్రజల్ని వలస కూలీలుగా రిక్రూట్ చేసుకుంటామని, ఎందుకంటే వాళ్ల చర్మ రంగు, ఆహార అలవాట్లు తమలాగే ఉంటాయని ఆ మంత్రి పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో కార్మికశాఖ క్షమాపణలు చెప్పింది.
తైపి: తైవాన్ మంత్రి(Taiwan Minister) హూ మింగ్ చున్ భారతీయులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈశాన్య భారత్‌కు చెందిన ప్రజల్ని వలస కూలీలుగా రిక్రూట్ చేసుకుంటామని, ఎందుకంటే వాళ్ల చర్మ రంగు, ఆహార అలవాట్లు తమలాగే ఉంటాయని ఆ మంత్రి పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. ఆ ప్రాంతంలో ఉన్న వారు ఎక్కువగా క్రైస్తవులు అని, వాళ్లు ఉత్పత్తి, నిర్మాణం, వ్యవసాయ రంగాల్లో పనిచేస్తుంటారని ఆమె అన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు హూ వెల్లడించారు. తైవాన్ కార్మిక విధానాలు సమానత్వాన్ని కోరకుంటాయన్నారను. వివక్ష ఉండదన్నారు. స్థానికులైనా, విదేశీ వర్కర్లు అయినా ఒక్కటే అన్నారు. వలస కూలీల రిక్రూట్మెంట్లో చర్మ రంగు, జాతికి ప్రాధాన్యత ఇవ్వవద్దు అని తైవాన్ నేత చెన్ కువాన్ టింగ్ పేర్కొన్నారు. మంత్రి హూ మింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ దేశ కార్మిక శాఖ సోమవారం క్షమాపణలు జారీ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

