ఇంగ్లండ్‌లో నూతనంగా నిర్మించిన గురుద్వారను సందర్శించిన కింగ్ చార్లెస్
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ (మూడవ) ఇంగ్లండ్‌లోని లుటన్‌లో నూతనంగా నిర్మించిన గురుద్వారను మంగళవారం సందర్శించారు.
లండన్ : బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ (మూడవ) ఇంగ్లండ్‌లోని లుటన్‌లో నూతనంగా నిర్మించిన గురుద్వారను మంగళవారం సందర్శించారు. గురునానక్ గురుద్వారను నిర్మించిన బాధ్యులు, వాలంటీర్లను కింగ్ చార్లెస్ కలుసుకున్నారు. గురుద్వారను సందర్శించిన సమయంలో కింగ్ చార్లెస్ తలకు కర్చీఫ్ చుట్టుకుని కనిపించారు.
గురుద్వార సభ్యులు, వాలంటీర్లను పలుకరిస్తూ ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. ఇదే ప్రాంతంలో సిక్కుల కోసం నడుపుతున్న స్కూల్‌ను నడిపే స్ధానికులతో ఆయన సంప్రదింపులు జరిపారు. పంజాబీ, సంప్రదాయ సంగీతం నేర్చుకుంటున్న స్కూల్ చిన్నారులతో ఆయన ముచ్చటించారు. కింగ్ చార్లెస్ గురుద్వార సందర్శనకు సంబంధించిన పొటోలను రాయల్ ఫ్యామిలీ అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్‌లో షేర్ చేవారు.
నూతనంగా నిర్మించిన గురునానక్ గురుద్వారను సందర్శించిన కింగ్ చార్లెస్ అక్కడ వాలంటీర్లను కలిసి ముచ్చటించారు.గురుద్వారలోని లుటన్ సిక్ సూప్ కిచెన్ స్టాండ్‌ను పరిశీలించారు. ఈ కిచెన్ వారానికి ఏడు రోజులు, సంవత్సరానికి 365 రోజుల పాటు వేడివేడి వెజిటేరియన్ మీల్స్‌ను సర్వ్ చేస్తుందని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. తూర్పు ఇంగ్లండ్ ప్రాంతంలోని బెర్ఫోర్డ్షైర్లో కింగ్ చార్లెస్ తొలి టూర్లో భాగంగా గురద్వారను సందర్శించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- gurudwara
- King Charles
- Visits
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

