King charles 3 | మేము లేకుంటే మీరుఫ్రెంచ్ మాట్లాడేవాళ్లు..ట్రంప్‌నకు కింగ్ చార్లెస్ కౌంటర్
వైట్‌హౌస్‌లో మంగళవారం రాత్రి జరిగిన విందులో పాల్గొన్న కింగ్ చార్లెస్ 3 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సరదాగా చురకలు అంటిస్తూ చరిత్ర పాఠాలు బోధించారు. ఉత్తర అమెరికాలో బ్రిటిష్ జోక్యం లేకపోయి ఉంటే అమెరికన్లు బహుశా ఫ్రెంచ్-ఇంగ్లిష్ మాట్లాడేవారేమోనని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
- ట్రంప్‌నకు కింగ్ చార్లెస్ కౌంటర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: వైట్‌హౌస్‌లో మంగళవారం రాత్రి జరిగిన విందులో పాల్గొన్న కింగ్ చార్లెస్ 3 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సరదాగా చురకలు అంటిస్తూ చరిత్ర పాఠాలు బోధించారు. ఉత్తర అమెరికాలో బ్రిటిష్ జోక్యం లేకపోయి ఉంటే అమెరికన్లు బహుశా ఫ్రెంచ్-ఇంగ్లిష్ మాట్లాడేవారేమోనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇరాన్ యుద్ధంపై అంతర్లీనంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ బ్రిటన్, అమెరికా మధ్య ప్రత్యేక బంధంపై ఇద్దరు నాయకులు ఆత్మీయంగా మాట్లాడిన సందర్భంగా ఈ సంభాషణ జరిగింది.
యూరోపియన్ మిత్రదేశాలు, రక్షణ వ్యయంపై ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడానికి బ్రిటిష్ రాజు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. మిస్టర్ ప్రెసిడెంట్, అమెరికా లేకపోతే ఐరోపా దేశాలు జర్మన్ మాట్లాడేవారని మీరు ఇటీవల వ్యాఖ్యానించారు. మేం లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారని నేను అనవచ్చా? అని కింగ్ చార్లెస్ అనడంతో సభికుల నుండి పెద్దపెట్టున నవ్వులు వెల్లువెత్తాయి. అమెరికా స్వాతంత్య్రానికి చాలా కాలం ముందు ఉత్తర అమెరికాలో బ్రిటన్, ఫ్రాన్స్‌ల మధ్య వలసవాద కాలంలో జరిగిన వైరాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు.
ఆ సమయంలో ఆ రెండు శక్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రాదేశిక ఆధిపత్యం కోసం పోరాడాయి. జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోకపోయి ఉంటే ఐరోపావాసులు జర్మన్, కొద్దిగా జపనీస్ మాట్లాడేవారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా పరోక్షంగా కింగ్ చార్లెస్ ప్రస్తావించారు. 1814లో వాషింగ్టన్ దహనం సమయంలో బ్రిటిష్ సైనికులు వైట్ హౌస్‌లోని కొన్ని భాగాలను తగలబెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ చార్లెస్ తనను తాను కించపరుచుకునే జోకుల పరంపరను కొనసాగించారు. వాస్తవానికి మేము బ్రిటిష్ వాళ్లం వైట్ హౌస్‌ను రియల్ ఎస్టేట్ పునరాభివృద్ధి చేయడానికి మా వంతు ప్రయత్నం చేశాము అని ఆయన చలోక్తి విసిరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

