King Charles | మళ్లీ ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు చార్లెస్.. క్యాన్సర్ వ్యాధికి చికిత్స..!
King Charles | బ్రిటన్ రాజు చార్లెస్-3 (75) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరోమారు లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. అంతకుముందు కింగ్ చార్లెస్ ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆ సందర్భంగా చార్లెస్ భార్య క్వీన్ కెమిల్లా కంట నీరు పెట్టుకున్నారు.
King Charles : బ్రిటన్ రాజు చార్లెస్-3 (75) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరోమారు లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. అంతకుముందు కింగ్ చార్లెస్ ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆ సందర్భంగా చార్లెస్ భార్య క్వీన్ కెమిల్లా కంట నీరు పెట్టుకున్నారు.
వైద్యబృందం నుంచి సలహా తీసుకున్న తర్వాతనే చార్లెస్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన తన ప్రసంగం నిడివిని 45 నిమిషాలకు తగ్గించుకున్నారు. బ్రిటన్ కింగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ గత ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు.
రాజు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ను షేర్ చేసిన బకింగ్‌హామ్ ప్యాలెస్.. బ్రిటన్ రాజు వీలైనంత త్వరగా సాధారణ విధులలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. కాగా, కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని దేశమంతా ప్రార్థిస్తోందని చెప్పారు. బ్రిటన్‌లోని ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా కింగ్ చార్లెస్ కోలుకోవాలని ఆకాంక్షించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

