Kanye West | 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: రాపర్ కాన్యే వెస్ట్
Kanye West | 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు ప్రముఖ రాపర్ కాన్యే వెస్ట్. తన ప్రత్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఉండాలని కోరుకుంటున్నట్లు కూడా కాన్యే పేర్కొన్నారు. 2020 లో పోటీ చేసిన కాన్యే.. కేవలం 70 వేల ఓట్లు సాధించాడు.
Kanye West | అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రముఖ రాపర్ కాన్యే వెస్ట్ దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన రన్నింగ్ మేట్‌గా ఉండాలని కాన్యే కోరుకుంటున్నారంట. ఈ మేరకు కాన్యే వెస్ట్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. 2024 లో అమెరికా అధ్యక్ష పదవికి జరుగనున్న ఎన్నికల్లో పోటీచేస్తానని పేర్కొన్నాడు. కాన్యే వెస్ట్ ర్యాపర్‌గా అమెరికా ప్రజానీకానికి పరిచితుడు. ఎందరో ఆయనకు అభిమానులుగా ఉన్నారు. ‘డార్క్ ఫాంటసీ’ రాపర్‌గా పేరుగాంచిన కాన్యే వెస్ట్ తన రాబోయే ప్రచారాన్ని ధృవీకరించారని బిల్బోర్డ్ మ్యాగజైన్ కథనంలో పేర్కొన్నది.
‘2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాను.. నా ప్రత్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఉండాలని కోరుకుంటున్నాను..’ అని ట్విట్టర్లో కాన్యే వెస్ట్ రాశారు. అలాగే, తనకు ఎవరు పోటీదారుగా ఉండాలని కోరుకుంటున్నారు? అంటూ తన ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు. కాన్యే ఇంతకుముందు 2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆలస్యంగా తన పార్టీని నమోదు చేయడం వల్లనే కాన్యే గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడని బిల్బోర్డ్ మ్యాగజైన్ రాసింది.
గత ఎన్నికల ప్రచారం అంతటా ఒకే ఒక్క ప్రధాన పాత్రలో కాన్యే కనిపించాడు. చివరి క్షణంలో రెండు వీడియో ప్రకటనలు విడుదల చేసినా.. అమెరికా ఓటర్లను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ ఎన్నికల్లో కాన్యే వెస్ట్ 50 రాష్ట్రాలలో నుంచి కేవలం 12 రాష్ట్రాలలో 70 వేల ఓట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాఉండగా, 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ప్రతినిధుల సభలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంతో ట్రంప్ మంచి ఊపుమీదున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

