Kanye and Kim Divorce | ఖరారైన కాన్యే వెస్ట్-కిమ్ కర్దాషియాన్ విడాకులు.. చైల్ సపోర్ట్‌గా కాన్యే ఎంత చెల్లిస్తారంటే..?
Kanye and Kim Divorce | రాపర్ కాన్యే వెస్ట్-నటి కిమ్ కర్దాషియాన్ వైవాహిక బంధం ముగిసింది. వీరి విడాకులు ఫైనలైజ్ అయ్యాయి. కోర్టు బయట వీరిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి వీరి మధ్య సఖ్యత..
Kanye and Kim Divorce | ప్రముఖ రాపర్ కాన్యే వెస్ట్-నటి కిమ్ కర్దాషియాన్ విడాకులు ఖరారయ్యాయి. చైల్డ్ సపోర్ట్‌గా కిమ్‌కు కాన్యే పెద్ద మొత్తంలో డబ్బు ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. కాన్యే వెస్ట్-కిమ్ కార్దాషియాన్ జంట 2014 లో ఇటలీలో అంగరంగ వైభవంగా పెండ్లి చేసుకున్నారు. కాన్యే నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో విడాకుల కోసం కిమ్ పిటిషన్ దాఖలు చేసింది.
పీపుల్ మ్యాగజైన్ ప్రకారం.. కాన్యే-కిమ్ జంట విడాకులు ఫైనల్ అయ్యాయి. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పిల్లల సంరక్షణ కోసం కాన్యే ప్రతి నెలా కిమ్‌కు 2 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది చట్టబద్ధంగా తన పేరును యేగా మార్చుకున్న కాన్యే వెస్ట్‌తో సరిదిద్దుకోలేని విభేదాలను ఎదుర్కొంటున్నట్లు తన విడాకుల పిటిషన్లో కిమ్ తెలిపింది. కోర్టు వెలుపల మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇద్దరూ అంగీకరించారు. దాంతో వీరి మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ సెటిల్మెంట్ ప్రకారం, యే అంగీకరించిన మొత్తాన్ని ప్రతి నెల ఒకటో తేదీన కిమ్ అకౌంట్లో జమ చేయాలి. పిల్లల విద్య, వైద్యం, భద్రత ఖర్చుల్లో సగానికి పైగా చెల్లించాలని అగ్రిమెంట్లో రాసుకున్నారు.
మారిటల్ స్టాటస్‌ను మార్చుకోవడానికి కోర్టు అనుమతించిన తర్వాత చట్టబద్ధంగా ఒంటరిగా ఉంటున్నట్లు కిమ్ ప్రకటించింది. ఇది జరిగిన 9 నెలల తర్వాత ఆమె విడాకుల కేసు పరిష్కారమైంది. 2012 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట.. పెద్ద కుమార్తె ‘నార్త్’ పుట్టిన కొద్ది నెలలకు వివాహం చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత 2020 లో వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు మొదలయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

