బీజింగ్, మార్చి 10: వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జీ జిన్పింగ్ (69) బాధ్యతలు చేపట్టారు. జిన్పింగ్ సారథ్యానికి చైనా పార్లమెంట్ శుక్రవారం ఏకగీవ్రంగా ఆమోదం తెలిపింది. దీంతో ఆయన మరో ఐదేండ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
గత అక్టోబర్లో పాలక పక్షం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) నాయకుడిగా ఆయన తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత రెండు పర్యాయాల కంటే ఎక్కువసార్లు అధికారంలో ఉన్న మొదటి నాయకుడిగా జిన్పింగ్ చరిత్ర సృష్టించారు.