Deepfake Videos: ఇటలీ ప్రధానిపై డీప్‌ఫేక్ వీడియో.. లక్ష యూరోల నష్టపరిహారం కోరిన జార్జియా మెలోనీ
Deepfake Videos: డీప్‌ఫేక్ వీడియోలను క్రియేట్ చేసిన కేసులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లక్ష యూరోల నష్టపరిహారాన్ని కోరారు. ప్రధానికి చెందిన డీప్‌ఫేక్ పోర్న్ క్లిప్‌లు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఆ కేసులో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
రోమ్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై డీప్‌ఫేక్ వీడియోల(Deepfake Videos)ను రూపొందించారు. ఆ వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఆ కేసులో ప్రధాని జార్జియా లక్ష యూరోల నష్టపరిహారాన్ని కోరారు. జార్జియాకు చెందిన డీప్‌ఫేక్ పోర్న్ వీడియోలను ఇద్దరు వ్యక్తులు క్రియేట్ చేశారు. వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. ఆ కేసులో 40 ఏళ్ల వ్యక్తితో పాటు అతని 73 ఏళ్ల తండ్రిని అరెస్టు చేశారు.
స్మార్ట్‌ఫోన్ ఆధారంగా ఆ ఇద్దరూ వీడియోలను అప్లోడ్ చేశారని, వాళ్లను ట్రాక్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇటలీ ప్రధానిగా జార్జియా నియామకం కాకముందే.. 2022లో ఆ డీప్‌ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారు. ఇటలీలో నష్టపరిహారం కేసులను నేరాభియోగ కేసులుగా గుర్తిస్తారు. ఆ కేసుల్లో నిందితులకు జైలుశిక్ష కూడా విధిస్తారు. జూలై 2వ తేదీన ఈ కేసులో మెలోనీ కోర్టు ముందు హాజరుకానున్నారు.
అమెరికాలోని పోర్న్ వెబ్సైట్లలో ఆ వీడియోలు అప్లోడ్ అయ్యాయని, వాటిని లక్షలాది మంది వీక్షించారని మెలోనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. మెలోనీ తనకు వచ్చే నష్టపరిహారాన్ని మహిళల సపోర్టు కోసం ఖర్చు చేయనున్నట్లు ఆమె తరపున లీగల్ టీమ్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

