Meta Layoffs | మరో 10 వేల మందికి మెటా గుడ్‌బై?
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరిన్ని ఉద్యోగాల్లో కోత పెట్టనున్నట్టు తెలిసింది. గత నవంబర్‌లో 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ఆ సంస్థ మరికొంత మందిని తీసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Meta Layoffs | వాషింగ్టన్, ఏప్రిల్ 19: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరిన్ని ఉద్యోగాల్లో కోత పెట్టనున్నట్టు తెలిసింది. గత నవంబర్‌లో 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ఆ సంస్థ మరికొంత మందిని తీసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వ్యయ నియంత్రణలో భాగంగా మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మెటా పరిధిలో ఉన్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్ ఇలా అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని చూస్తున్నది. ఇప్పటికే ఈ మేరకు మేనేజర్లకు సమాచారం పంపినట్టు తెలిసింది. మార్చిలోనే సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. అన్ని విభాగాల్లో సిబ్బంది కూర్పును సమీక్షించి కంపెనీ సామర్థ్యాన్ని మరింత పెంచాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగానే ఈ లేఫ్‌లు ప్రకటిస్తున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

