Taklamakan Desert | ఎడారిని వనంలా మార్చేశారు.. చైనాలో మరో అద్భుతం!
చైనా మరో అద్భుతం చేసింది. పచ్చాని రంగేసినట్టు.. ఓ ఎడారిని వనంలా మార్చేసింది. 3,050 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి తక్లమకాన్ ఎడారిని కనుమరుగయ్యేలా అడవిని అభివృద్ధి చేసింది. ఇది జర్మనీ విస్తీర్ణంతో సమానం కావడం గమనార్హం.
- ఎడారిని వనంలా మార్చిన చైనా
- 3,050 కిలోమీటర్ల గ్రీన్ బెల్ట్
Taklamakan Desert | బీజింగ్, మార్చి 24: చైనా మరో అద్భుతం చేసింది. పచ్చాని రంగేసినట్టు.. ఓ ఎడారిని వనంలా మార్చేసింది. 3,050 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి తక్లమకాన్ ఎడారిని కనుమరుగయ్యేలా అడవిని అభివృద్ధి చేసింది. ఇది జర్మనీ విస్తీర్ణంతో సమానం కావడం గమనార్హం. తద్వారా ఎడారి విస్తరణ, ఇసుక తుఫాన్లను నివారించింది. దశాబ్దాల పాటు చైనా పరిశోధకులు, 6 లక్షల మంది కార్మికులు కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఎడారి హైసింత్ సహా అనేక ఔషధ మొక్కలను నాటారు.
ఇవి ఎడారీకరణను ఆపడమే కాదు, ఔషధాలను అందించేందుకు దోహదపడతాయి. ఎడారి మొక్కలకు అందించే నీటి వ్యవస్థకు సౌర విద్యుత్తు అందేలా చేసింది. చైనాలోని అతిపెద్ద రైల్వే లైన్లలో ఒకటైన హోటాన్-రియోగ్జింగ్ మార్గం ఈ ఏడారి గుండా వెళ్తున్నది. ఈ రైల్వే లైన్ సాయంతో ఎర్ర ఖర్జూరా, వాల్నట్స్ తదితర పంటల వ్యాపారం కూడా జరుగుతున్నది. మరోవైపు 8.5 గిగావాట్ల సౌర విద్యుత్తు, 4 గిగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే అక్కడి నుంచి జిన్జియాంగ్ సిటీకి విద్యుత్తు సరఫరా అవుతుంది. దీన్ని సహారా గ్రేట్ గ్రీన్ వాల్‌తో పోలుస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

