జెరూసలేం, జనవరి 1: న్యాయ సంస్కరణల పేరుతో ఇజ్రాయెల్లో నెతన్యాహూ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రభుత్వ నిర్ణయాల్ని రద్దు చేసే అధికారం కోర్టులకు లేదంటూ తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు కాదని పేర్కొంటూ ఆ దేశ సుప్రీంకోర్టు ధర్మాసనం 8-7 మెజార్టీతో సోమవారం తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు, దిగువ కోర్టుల అధికారాల్ని పరిమితం చేస్తూ ఈ ఏడాది జూలైలో నెతన్యాహూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇజ్రాయెల్లో సంచలనం రేపింది. నెతన్యాహూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తాయి. ముఖ్యమైన అధికార, రాజకీయ పదవుల్లో తనవాళ్లను నియమించుకునేందుకు నెతన్యాహూ ఈ చట్టాన్ని తీసుకొచ్చాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అక్టోబర్ 7న హమాస్ దాడి ఘటనతో ఈ అంశం తాత్కాలికంగా పక్కకుపోయింది.