Gaza Battle | గాజా పోరులో నటుడికి గాయాలు
Gaza Battle : ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ గాయకుడు, రచయిత, నటుడు ఇడాన్ అమెది గాయపడ్డాడని ఇజ్రాయెల్ దౌత్యవేత్త వెల్లడించారు.
Gaza Battle : ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ గాయకుడు, రచయిత, నటుడు ఇడాన్ అమెది గాయపడ్డాడని ఇజ్రాయెల్ దౌత్యవేత్త వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్ ఐకానిక్ షో ఫౌడాలో అమెడి నటనకు విశేషాదరణ లభించింది. పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడిన అనంతరం గాజాపై ప్రతిదాడుల నేపధ్యంలో అమెడి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)లో చేరారు.
గాజాలోని ఖాన్ యూనిస్‌లో జరిగిన ఘర్షణల్లో అమెడి తీవ్రంగా గాయపడ్డాడని ఇజ్రాయెల్ దౌత్యవేత్త అవియా లెవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గాజా యుద్ధంలో ఫౌడా నటుల్లో ఒకరైన ఇదాన్ అమెడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన వేగంగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామని లెవి ట్వీట్ చేశారు.
కాగా గతఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ భీకర దాడికి తెగబడటంతో 1200 మందికిపైగా మరణించగా 240 మందిని బందీలుగా నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆపై గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ప్రతీకార దాడులు, భూతల దాడుల్లో 22,000 మందికి పైగా ప్రజలు మరణించారు. అక్టోబర్ 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 57,000 మందికి పైగా పాలస్తీనీయులు గాయపడ్డారు.
Read More :
Udhayanidhi Stalin | తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

