అమెరికాకే ఝలక్ ఇచ్చిన ఇజ్రాయిల్.. సొంత నిర్ణయంతో ముందుకు
అమెరికాను పొమ్మంది ఇజ్రాయిల్. అమెరికా చెప్పినా… ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా నడుచుకుంటోంది. ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్‌కి సంబంధించిన బ్యాటరీలను ఇవ్వడానికి ఉక్రెయిన్ నిరాకరించింది. అంటే.. రష్యా కూటమికి మద్దతివ్వడానికి ఇజ్రాయిల్ రెడీ అయిపోయిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ కథనం ప్రకారం.. తాము ఉక్రెయిన్‌కు ఐరన్ డ్రోమ్ బ్యాటరీలను పంపలేమని అమెరికాకు ఇజ్రాయిల్ తెగేసి చెప్పేసింది. అంటే… ఉక్రెయిన్ ఈ బ్యాటరీల విషయంలో నేరుగా ఇజ్రాయిల్‌నే సంప్రదించాల్సి వుంటుంది. అయితే.. తమకు ఈ బ్యాటరీలు కావాలంటూ కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్ అమెరికాను ఆశ్రయించింది. దీనికి డెమోక్రెట్స్, రిపబ్లికన్లు మద్దతిచ్చారు.
ఆ తర్వాత అమెరికా ఈ విషయంపై ఇజ్రాయిల్‌తో చర్చించింది. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ ఎదురు తిరగడంతో అమెరికా ఇరుక్కున్నట్లైంది. వాస్తవానికి అమెరికా, ఇజ్రాయిల్ కలిసే ఈ ఐరన్ డ్రోమ్ బ్యాటరీలను తయారు చేస్తున్నాయి. అందుకే వీటి సాంకేతికత కావాలంటే ఇరు దేశాల ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఉక్రెయిన్ మాత్రం ఇజ్రాయిల్ సహాయాన్ని కోరుతోంది. ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో తమకు ఇజ్రాయిల్ సహాయం కావాలని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వారం రోజుల కిందటే అభ్యర్థించింది. అయినా… ఇజ్రాయిల్ ఈ సాంకేతికతను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

