గాజాపై దాడులు తీవ్రం
హమాస్‌తో యుద్ధంలో భాగంగా గాజా స్ట్రిప్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. యుద్ధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొన్నట్టు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తాజాగా వెల్లడించారు. గాజా సిటీలోని పౌరులు దక్షిణ గాజాలోకి వెళ్లిపోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు.
- విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యం
- సిరియా ఎయిర్‌పోర్టులపై మళ్లీ దాడి
- వెస్ట్‌బ్యాంక్‌పైనా వైమానిక దాడులు
- పాలస్తీనియన్లకు భారత్ మానవతా సాయం
జెరూసలేం/గాజా సిటీ, అక్టోబర్ 22: హమాస్‌తో యుద్ధంలో భాగంగా గాజా స్ట్రిప్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. యుద్ధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొన్నట్టు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తాజాగా వెల్లడించారు. గాజా సిటీలోని పౌరులు దక్షిణ గాజాలోకి వెళ్లిపోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే లక్ష్యంతో తదుపరి భూతల దాడులు చేపట్టాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది.
సిరియాపై మరోసారి దాడులు
గాజాతో పాటు వెస్టుబ్యాంకు, సిరియాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. సిరియాలోని డమాస్కస్, అలెప్పొ ఎయిర్‌పోర్టులపై మరోసారి బాంబు దాడులకు పాల్పడింది. రన్వేలు దెబ్బతినడంతో సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని స్థానిక మీడియా పేర్కొన్నది. ఆక్రమిత వెస్టుబ్యాంక్ పరిధిలోని ఓ మసీదుపై దాడి చేసింది.
భారత్ సాయం
భారత్ ఆదివారం 6.5 టన్నుల మేర వైద్య సామ గ్రి, 32 టన్నుల విపత్తు ఉపశమన సామగ్రిని సీ-17 రవాణా విమానం ద్వారా పంపింది. ఇవి ఈజిప్టులోని ఎల్ అరిష్ ఎయిర్‌పోర్టుకు చేరుకొంటాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
వారిని ఏరివేసేందుకు ప్రత్యేక యూనిట్
ఈ నెల 7న ఇజ్రాయెల్‌లో హమాస్ సృషించిన మారణహోమం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ ఏరివేసేందుకు ఇజ్రాయెల్ నిఘా ఏజెన్సీ షిన్ బెట్ త్వరలో ‘నిలి’ పేరుతో ఓ కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు రసాయన ఆయుధాలు వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Gaza
- Israel
- Israel-Hamas war
- WFP
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

