IDF | హమాస్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్ : యుద్ధ నేరంలో అంటకాగితే భారీ మూల్యం తప్పదని హెచ్చరిక
ఇజ్రాయెల్‌పై ఉగ్ర సంస్ధ హమాస్ మెరుపు దాడుల నేపధ్యంలో ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) ప్రతినిధి రేర్ అడ్మిరల్ డేనియల్ హగరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జెరూసలెం : ఇజ్రాయెల్‌పై ఉగ్ర సంస్ధ హమాస్ మెరుపు దాడుల నేపధ్యంలో ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) ప్రతినిధి రేర్ అడ్మిరల్ డేనియల్ హగరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హమాస్ దాడిని ఆయన యుద్ధ నేరంగా అభివర్ణించారు. యుద్ధ నేరంలో పాలుపంచుకున్న వారు భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ రక్షణ బలగాలు ట్విట్టర్లో హగరి వీడియో స్టేట్మెంట్ను పోస్ట్ చేశారు. హమాస్ భీకర దాడి యుద్ధ నేరం. మహిళలు, చిన్నారులను బందీలుగా తీసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమే కాకుండా ఇస్లాంకు వ్యతిరేకమైనదని ఆక్షేపించారు. ఈ నేరంలో పాల్గొన్నవారంతా మూల్యం చెల్లించుకోకతప్పదు. ఈ యుద్ధం సంక్లిష్టమైనదని, రాబోయే రోజులు సవాళ్లతో కూడుకున్నవని చెప్పుకొచ్చారు.
ఇజ్రాయెల్ భద్రతా బలగాలు (ఐడీఎఫ్) అత్యంత శక్తివంతమైనవని, తన సత్తాను చాటేందుకు అవి సర్వశక్తులు ఒడ్డుతాయని పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Israel-Hamas war) మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. గాజా స్ట్రిప్ సమీపంలో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపున ఇప్పటివరకూ 400 మందికి పైగా మరణించారు. దాడుల్లో పెద్దసంఖ్యలో సైనికులు, పోలీసులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది.
Read More :
Air India flights | 14 వరకూ టెల్ అవీవ్‌కు ఎయిరిండియా విమానాల రాకపోకల నిలిపివేత
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

