Ismail Haniyeh | హమాస్ నేత హనియాను చంపింది మేమే.. అంగీకరించిన ఇజ్రాయెల్
హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను (Ismail Haniyeh) అంతమొందించింది తామేనని ఇజ్రాయెల్ (Israel) అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు.
వాషింగ్టన్: హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను (Ismail Haniyeh) అంతమొందించింది తామేనని ఇజ్రాయెల్ (Israel) అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను చంపింది తామేనని ఇజ్రాయెల్ తొలిసారిగా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఎక్కువగా క్షిపణులు ప్రయోగిస్తున్నారని, వారికి ఓ స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నానంటూ హమాస్, హెజ్బొల్లాలను ఓడించామన్నారు. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశామని, సిరియాలో బషర్ అల్ అసద్ పాలననను పడగొట్టామని తెలిపారు. హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చామని వెల్లడించారు. యెమెన్‌లోని హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదంటూ హెచ్చరించారు.
జూలై 31న ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన హనియా.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దాడి జరిగింది. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా టాప్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం సాయంత్రం ప్రకటించగా.. దానికి కొద్ది గంటల తర్వాతనే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో ప్లాన్ ప్రకారమే హనియేను ఇజ్రాయెల్ హత్యచేసిందని ఇరాన్ అప్పట్లోనే ఆరోపించింది.
హనియా ఎవరంటే..
హనియా 1963లో గాజా సిటీకి సమీపంలోని ఒక శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980లో హమాస్ గ్రూపులో చేరగా.. 1990లో తొలిసారిగా హనియా పేరు వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన హనియా.. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించిన తర్వాత గ్రూపులో కీలక వ్యక్తిగా ఎదిగాడు. 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్‌ను పాలించాడు. 2017లో హమాస్ చీఫ్‌గా ఎన్నికైన హనియాను.. అమెరికా ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో ఆయన గాజా స్ట్రిప్‌ను వీడిన ఆయన ఖతార్‌లో నివాసం ఏర్పర్చుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Hamas
- iran
- Ismail Haniyeh
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

