Israel-Hezbollah War | లెబనాన్‌పై బాంబుల వర్షం.. 550 మంది మృతి
Israel-Hezbollah War | ఇజ్రాయెల్, హెజ్బొల్లా పూర్తి స్థాయి యుద్ధం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మంగళవారం కూడా దక్షిణ లెబనాన్‌పై దాడులు కొనసాగించింది. దీంతో దాడుల్లో దాదాపు 558 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు లెబనాన్‌లోని బీరుట్, సిడాన్ నగరాల్లో నిర్వాసితుల కోసం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు.
- దక్షిణభాగం లక్ష్యంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్
- భీకర దాడితో పూర్తిస్థాయి యుద్ధం దిశగా అడుగులు
- ఆశ్రయం కోసం దేశవ్యాప్తంగా బాధితుల అవస్థలు
- 1558 మందికి గాయాలు
హెజ్బొల్లా కీలక కమాండర్ ఇబ్రహీం మృతి!
హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థలోని మిసైల్స్, రాకెట్ దళం కమాండర్ ఇబ్రహీం మహమ్మద్ కబిసిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ప్రకటించింది. బీరుట్లో జరిపిన గగనతల దాడుల్లో ఈ దళంలోని అదనపు సెంట్రల్ కమాండర్లు కూడా మరణించారని చెప్పింది. ఇజ్రాయెల్ సైనికులపై అనేక దాడులకు ఇబ్రహీం ప్రణాళికలు రచించి, అమలు చేశాడని వెల్లడించింది.
ఐరన్‌డోమ్‌తో హెజ్బొల్లా రాకెట్లు విలవిల
లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ సోమవారం రాత్రి ప్రయోగించిన 200 రాకెట్లు ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ ధాటికి తుత్తునియలు అయిపోయాయి. ఇజ్రాయెల్‌లోని హైఫా, కిరియత్ బయాలిక్, జెజ్రీల్ లోయలపై ఈ రాకెట్ల దాడి జరిగింది. వీటిని మధ్యలోనే కూల్చేసిన దృశ్యాలను ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పోస్ట్ చేసింది.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 40 ఏండ్ల శత్రుత్వం
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శత్రుత్వం 40 ఏండ్ల నాటిది. 1980వ దశకం ప్రారంభంలో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను నిర్మూలించడం కోసం ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్ నుంచి పీఎల్‌ఓను పారదోలడంలో మొదట్లో ఇజ్రాయెల్ విజయం సాధించింది. 1983లో ఇరాన్ మద్దతుతో హెజ్బొల్లా ఏర్పడింది. ఇది ఇజ్రాయెల్ ప్రధాన శత్రువుల్లో ఒకటిగా హెజ్బొల్లా మారింది. గెరిల్లా యుద్ధంతోపాటు కోవర్టు ఆపరేషన్లలో కూడా దీనికి నైపుణ్యం ఉంది. లెబనాన్‌లో, దాని వెలుపల ఉన్న ఇజ్రాయెలీ టార్గెట్లను అస్థిరపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. 1980, 1990 దశకాల్లో బీరుట్‌లోని అమెరికా, ఫ్రెంచ్ మిలిటరీ బ్యారక్‌లపై అనేక దాడులు చేసింది. ఇజ్రాయెల్ కూడా హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుబెడుతూ వస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

