Chicago sinking | అమెరికాలో మూడో అతిపెద్ద నగరం షికాగో కుంగుతున్నదా ? కారణాలేంటి ?
అమెరికాలో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన షికాగో క్రమంగా కుంగుతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. భూగర్భ పర్యావరణ మార్పులే (underground climate change) ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Chicago sinking | షికాగో: అమెరికాలో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన షికాగో క్రమంగా కుంగుతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. భూగర్భ పర్యావరణ మార్పులే ( underground climate change ) ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిణామాన్ని ‘సబ్‌సర్ఫేస్ హీట్ ఐలాండ్స్’ అని అంటారని, భవనాల నుంచి విడుదలయ్యే వేడి, సబ్వే వంటి భూగర్భ రవాణా వ్యవస్థల కారణంగా ఇది జరుగుతుందని పేర్కొన్నారు.
పట్టణాల్లో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూమిలో మార్పులకు కారణమవుతున్నాయని, భవనాలు, ఇతర ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. నగరం ఎంత కిక్కిరిసి ఉంటే, అంత ఎక్కువగా భూగర్భం పర్యావరణ మార్పులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని ఇల్లినాయిస్లోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అలెగ్జాండ్రో రోటా లోరియా తెలిపారు.
షికాగో లూప్ జిల్లాలో పరిశోధకులు భూమిపైన, భూగర్భంలోనూ 150 టెంపరేచర్ సెన్సార్లను అమర్చారు. బేస్మెంట్స్, టన్నెల్స్, పార్కింగ్ గ్యారేజ్ వంటి భిన్న ప్రదేశాల్లో వీటిని అమర్చారు. నిర్మాణాలు, రవాణా కారణంగా ఎలాంటి అధిక వేడి వెలువడని, ఎలాంటి నిర్మాణాలు లేని గ్రాంట్ పార్క్ ప్రాంతంలోనూ ఈ సెన్సర్లను బిగించారు. మూడేండ్లపాటు డాటాను సేకరించారు. గ్రాంట్ పార్క్ కంటే లూప్ జిల్లా అండర్‌గ్రౌండ్ టెంపరేచర్ 10 డిగ్రీలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
ఇది భూగర్భంలో మార్పులకు కారణమవుతున్నదని పరిశోధకులు తెలిపారు. కాగా, జనాభా పరంగా అతిపెద్ద నగరమైన న్యూయార్క్ కూడా కుంగుతున్నదని పరిశోధకులు ఇదివరకే వెల్లడించారు. 20 ఏండ్లపాటు అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. భూగర్భ పర్యావరణ మార్పులు భూగర్భ జలాల కలుషితానికి కారణం కావొచ్చని, అలాగే భూగర్భ రైలు ప్రయాణికులు అధిక వేడి కారణంగా అనారోగ్యంబారిన పడే ప్రమాదం ఉన్నదని శాస్ర్తవేత్తలు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

