Iran War | అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. సిద్ధంగానే ఉన్నామన్న ఇరాన్
Iran War : ఇరాన్–అమెరికా మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కూడా రద్దు కావొచ్చు. ఇదే జరిగితే, ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభం కావొచ్చు.
Iran War : ఇరాన్–అమెరికా మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. చర్చలు ఎప్పుడు జరుగుతాయో, అసలు జరుగుతాయో లేదో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కూడా రద్దు కావొచ్చు. ఇదే జరిగితే, ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభం కావొచ్చు. అయితే, ఈ విషయంపై ఇరాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇరాన్ డిప్యూటీ ఆఫ్ ద మిలిటరీ హెడ్‌క్వార్టర్స్ అధికారి మొహమ్మద్ జాఫర్ అసాది మాట్లాడుతూ, అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా అంత ఆసక్తిగా లేదని, దీంతో యుద్ధం తప్పకపోవచ్చని ఆయన అన్నారు. అమెరికా ఇటీవల తీసుకుంటున్న చర్యలు, ప్రకటనలు చూస్తే ద్వైపాక్షిక అంశాలపై అమెరికాకు చిత్తశుధ్ది లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. అమెరికా ఇటీవల చేసిన ప్రకటనలు ముందుగా చమురు ధరలు తగ్గించేందుకేనని, అలాగే వాళ్లు సృష్టించిన గందరగోళాన్ని తగ్గించేందుకే అని అసాది అన్నారు.
చర్చల విషయంలో అమెరికాకు చిత్తశుద్ధి లేకపోవడంతో అమెరికాతో తమ దేశానికి మళ్లీ యుద్ధం తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. అందుకే యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు తమ సైనిక దళాలు పూర్తి సిద్ధంగా, హై అలర్ట్‌తో ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య తాజా చర్చల అంశంలో ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై తాను అసంతృప్తితో ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ నుంచి తాజా ప్రకటన వెలువడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

