Iran War | అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్.. పాకిస్తాన్లో కలవబోమని స్పష్టం.. కారణం ఇదే
Iran War : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఆగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఒకవైపు భీకర యుద్ధం కొనసాగుతుంటే, మరోవైపు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి.
Iran War : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఆగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఒకవైపు భీకర యుద్ధం కొనసాగుతుంటే, మరోవైపు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి. అయితే, ఈ చర్చలు, శాంతి ఒప్పందం ముందుకు కదలడం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమయ్యాయి. దీని ప్రకారం త్వరలో రెండు దేశాల మధ్య పాకిస్తాన్, ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగాలి.
కానీ, ఈ చర్చలకు ఇరాన్ అడ్డుచెప్పిందని సమాచారం. అమెరికా అధికారులతో చర్చించేందుకు ఇరాన్ అంగీకరించడం లేదు. అమెరికా డిమాండ్లు ఆమోదయోగ్యంగా లేవని, అందువల్ల అమెరికా అధికారులను కలవాలనుకోవడం లేదని ఇరాన్ అధికారులు పాకిస్తాన్‌కు తెలిపారు. దీంతో చర్చలు నిలిచిపోయాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే, హార్ముజ్ జలసంధి అందుబాటులోకి వస్తుందని భావించిన ప్రపంచ దేశాలకు ఇరాన్ నిర్ణయం ఇబ్బందికరంగా మారనుంది. ట్రంప్ ఇటీవల చర్చల అంశంపై స్పందించారు. ఇరాన్‌తో చర్చల కోసం ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. అయితే, తాము చర్చల్లో పాల్గొనడం లేదని గతంలోనే ఇరాన్ ప్రకటించింది.
అయినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా చర్చలపై ఒప్పించారు. కానీ, ఇప్పుడు ఇరాన్ మాత్రం చర్చలకు దూరంగా జరిగింది. దీంతో తదుపరి చర్చలను పాకిస్తాన్ వెలుపల నిర్వహించాలని మధ్యవర్తిత్వ దేశాలు భావిస్తున్నాయి. చర్చల కోసం ఇరాన్‌కు అమెరికా 15 అంశాలతో ఒక ప్రతిపాదన పంపింది. దీన్ని ఇరాన్ తిరస్కరించింది. ఈ ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. మరోవైపు ఇరాన్ కూడా కొన్ని ప్రతిపాదనల్ని అమెరికాకు పంపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Donald Trump
- F-15
- Iran war
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

