Iran vs US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపడే ఛాన్స్.. ఐదు షరతులతో అమెరికాతో చర్చలకు ఇరాన్ ఒకే
Iran vs US | అమెరికా, ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలంటే అమెరికా తమ ఐదు షరతులను తప్పనిసరిగా అంగీకరించాలని ఇరాన్ స్పష్టంచేసింది.
Iran vs US : అమెరికా, ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలంటే అమెరికా తమ ఐదు షరతులను తప్పనిసరిగా అంగీకరించాలని ఇరాన్ స్పష్టంచేసింది. ఇరాన్ విధించిన షరతుల్లో ప్రధానంగా తమ భూభాగంపై, ముఖ్యంగా ఇంధన వనరులపై అమెరికా, దాని మిత్రదేశాలు చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని విధించిన వాణిజ్య, చమురు ఆంక్షలన్నింటినీ పూర్తిగా ఎత్తివేయాలని కోరింది. అలాగే పశ్చిమాసియా ప్రాంతం నుంచి ముఖ్యంగా తమ సరిహద్దుల నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని పేర్కొంది. వీటితోపాటు యుద్ధంవల్ల దెబ్బతిన్న తమ చమురు బావులు, ఇతర మౌలిక సదుపాయాలకు అమెరికా నష్టపరిహారం చెల్లించాలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఇరాన్ తేల్చిచెప్పింది.
ఖతార్, ఒమన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరాన్ విధించిన ఈ షరతులపై వైట్ హౌస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. గతంలో ‘షరతులు లేని చర్చల’కు మాత్రమే సిద్ధమని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆసక్తి నెలకొంది. కాల్పుల విరమణ వంటి కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించినా నష్టపరిహారం వంటి డిమాండ్‌కు అమెరికా అంగీకరించడం కష్టమనే విశ్లేషణలు వినపడుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

