Indus Water Treaty: సింధు జల ఒప్పందానికి 61 ఏండ్లు
Indus Water Treaty : భారతదేశం-పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందంపై సంతకాలు చేసి ఇవాల్టికి 61 ఏండ్లు పూర్తయ్యాయి. 1960 లో జరిగిన ఈ ఒప్పందంపై...

భారతదేశం-పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందంపై (Indus Water Treaty) సంతకాలు చేసి ఇవాల్టికి 61 ఏండ్లు పూర్తయ్యాయి. 1960 లో జరిగిన ఈ ఒప్పందంపై రెండు దేశాల ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అయూబ్‌ఖాన్ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య 6 నదులకు సంబంధించిన నీటి పంపకాల వివాదాలకు పరిష్కారంగా ఈ ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య ఇప్పటికీ అనేక వివాదాలు ఉన్నప్పటికీ.. ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం లేకపోవడం విశేషం.
సింధు నది విస్తీర్ణం దాదాపు 11.2 లక్షల కి.మీ. ఈ ప్రాంతం పాకిస్తాన్ (47 శాతం), భారతదేశం (39 శాతం), చైనా (8 శాతం), ఆఫ్ఘనిస్తాన్ (6 శాతం) లో ఉన్నది. సింధు నది పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 కోట్ల మంది నివసిస్తున్నారు. విభజన సమయంలో సింధు నది లోయ, దాని కాలువలను కూడా విభజించారు. అయితే పాకిస్తాన్ దాని నీటి వాటా కోసం పూర్తిగా భారత్‌పై ఆధారపడి ఉన్నది.
పాకిస్తాన్‌కు నీటి సరఫరా కోసం 1948 మార్చి 31 నాటికి పాకిస్తాన్‌కు కొంత వాటా ఇవ్వాలని నిర్ణయించారు. 1948 ఏప్రిల్ 1 న, భారతదేశం కాలువల నీటిని నిలిపివేసింది. దాంతో పాకిస్తాన్లో పరిస్థితి మరింత దిగజారింది. రెండు దేశాల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి. చివరకు సింధు జలాల ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం, సింధు నది లోయలోని నదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. తూర్పు ప్రాంతంలోని మూడు నదులు – రవి, బియాస్, సట్లెజ్.. భారతదేశానికి.. సింధు, చీనాబ్, జీలం నదులను పాకిస్తాన్‌కు ఇచ్చారు. పాకిస్తాన్‌లోని నదుల నీటిని విద్యుత్, నీటిపారుదలకు పరిమితంగా ఉపయోగించుకునే హక్కు కూడా భారతదేశానికి ఉన్నది. ఐదేండ్ల క్రితం యురిలో భారతీయ సైనికులను ఉగ్రవాదులు బాంబులతో హతమార్చిన సమయంలో ఈ ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేయాలనే డిమాండ్ వచ్చింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2018 : అమలులోకి ట్రిపుల్ తలాక్ చట్టం
2008 : ఢిల్లీ బాట్లా హౌస్ ఎన్కౌంటర్
2007 : డర్బన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓవర్లో 6 సిక్సర్లు బాది 12 బంతుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి రికార్డు సాధించిన యువరాజ్ సింగ్
2006 : థాయిలాండ్‌లో సైనిక తిరుగుబాటు, ప్రధానిగా సురాయుద్ ఎన్నిక
1982 : ఆన్లైన్ సందేశాన్ని ఉపయోగించిన మొదటివ్యక్తిగా నిలిచిన స్కాట్ ఫహ్మాన్
1965 : అంతరిక్ష ప్రయాణం చేపట్టిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ జననం
1957 : నెవాడా ఎడారిలో మొదటి భూగర్భ అణు పరీక్ష చేపట్టిన అమెరికా
1907 : సింథటిక్ ఆయిల్‌ను కనుగొన్న స్కాటిష్ శాస్త్రవేత్త జేమ్స్ యాంగ్
1888 : బెల్జియంలో మొట్టమొదటి అందాల పోటీలు ప్రారంభం
ఇవి కూడా చదవండి..
ఎన్నికల బరిలో 49 మంది భారత సంతతి వ్యక్తులు
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

