Zambia | కలరా కోరల్లో జాంబియా.. మానవతను చాటుకున్న భారత్
Zambia | ఆఫ్రికన్ దేశం జాంబియా (Zambia) కలరా (cholera) కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. వేలాది మంది ప్రజలు ఈ అతిసార వ్యాధి బారినపడి.. వైద్యసౌకర్యాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి భారత్ (India) ఆపన్న హస్తం అందించింది.
Zambia | ఆఫ్రికన్ దేశం జాంబియా (Zambia) కలరా (cholera) కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. వేలాది మంది ప్రజలు ఈ అతిసార వ్యాధి బారినపడి.. వైద్యసౌకర్యాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మునుపెన్నడూ ఎరుగని విధంగా ఆ దేశాన్ని కలరా వ్యాధి కుదిపేస్తోంది.
ఈ అతిసార వ్యాధి మూలాన వేలల్లో రోగులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి భారత్ (India) ఆపన్న హస్తం అందించింది. క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలను సాయంగా పంపింది. మొత్తంగా ఆ దేశానికి 3.5 టన్నుల మానవతా సాయం (humanitarian) పంపినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ చిన్న దేశంలో కలరా మహమ్మారి కారణంగా గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకూ దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మందికిపైగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దేశంలోని మొత్తం పది ప్రావిన్సులకు గానూ తొమ్మిది ప్రావిన్సులకు ఈ కలరా వ్యాపించింది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొన్న ఈ కలరా వ్యాప్తిని అరికట్టడానికి జాంబియా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.
స్టేడియాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తోంది. సామూహిక టీకా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అధికారులు ప్రభావిత ప్రాంతాలకు రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాన్ని కూడా చేపట్టారు.
Also Read..
Actor Vishal | విజయ్ బాటలో విశాల్.. త్వరలో రాజకీయ పార్టీ ప్రకటన..?
Layoffs 2024 | కొనసాగుతున్న లేఆఫ్స్ పర్వం.. కొత్త ఏడాది తొలి మాసంలో 30 వేల కోతలు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- cholera
- humanitarian
- India
- zambia
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

