Actor Vishal | విజయ్ బాటలో విశాల్.. త్వరలో రాజకీయ పార్టీ ప్రకటన..?
Actor Vishal | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయ (politics) రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరో తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
Actor Vishal | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయ (politics) రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు. అయితే తన పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అదేవిధంగా ఏ పార్టీకి మా పార్టీ మద్దతివ్వట్లేదని విజయ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో విజయ్ బాటలోనే తాజాగా మరో హీరో తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ నటుడు విశాల్ (Actor Vishal) త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాట టాక్ నడుస్తోంది. పార్టీ ఏర్పాటుకు విశాల్ సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా రాజకీయ ఎంట్రీ ఉండబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాల్ పొలిటికల్ ఎంట్రీపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తమిళనాట టాక్ వినిపిస్తోంది. అతి త్వరలోనే ఆయన తన పార్టీ పేరును కూడా ప్రకటించబోతున్నారని సమాచారం.
కాగా, తమిళనాడు రాజకీయాలపై విశాల్ చాలా ఏళ్లుగా ఆసక్తిగా ఉన్నారు. గతంలో చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ కూడా వేశారు. అయితే, కొన్ని కారణాల రీత్యా ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. విశాల్ ప్రస్తుతం ‘విశాల్ పీపుల్స్ హెల్త్ మూమెంట్’ పేరుతో ప్రజలకు సేవ చేస్తున్న విషయం తెలిసిందే. చెన్నైలో వరదలు ఇతర విపత్తు సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారు. అయితే, గతంలో ఓ సారి విశాల్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. అయితే నా రాజకీయ ప్రవేశం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను. సమాజసేవ చేసేందుకే రాజకీయాల్లోకి అడుగు పెడతా’ అని విశాల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా తెలుస్తోంది.
Also Read..
Varun Kumar | లైంగిక ఆరోపణలు.. భారత హాకీ ప్లేయర్‌పై కేసు నమోదు
Snapchat | 500 మంది ఉద్యోగులపై స్నాప్‌చాట్ వేటు
Layoffs 2024 | కొనసాగుతున్న లేఆఫ్స్ పర్వం.. కొత్త ఏడాది తొలి మాసంలో 30 వేల కోతలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

