బేజోస్, మస్క్, బఫెట్.. బిలియనీర్లే ట్యాక్స్ ఎగ్గొట్టారు

న్యూయార్క్: అమెరికాలో సంపన్నుల ఆస్తులు పెరుగుతున్నా.. వారు కడుతున్న పన్నులు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. బిలియనీర్లు అంతా ఎలా పన్ను తప్పించుకుంటున్నారో ఆ దేశానికి చెందిన న్యూస్ వెబ్సైట్ లీక్ చేసింది. ప్రోపబ్లికా సైట్ ఆ వివరాలను తన సైట్లో పోస్టు చేసింది. గడిచిన కొన్నేళ్లలో జెఫ్ బేజోస్, ఎలన్ మస్క్, వారెన్ బఫెట్ లాంటి మహా సంపన్నులు ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లిస్తున్నారో ఆ సైట్లో ప్రజెంట్ ఛేశారు. 2007, 2011 సంవత్సరాల్లో అమెజాన్ సీఈవో బేజేస్ అసలు ఏమాత్రం పన్ను చెల్లించలేదట. ఇక టెస్లా చీఫ్ మస్క్ కూడా 2018లో ఒక్క డాలర్ కూడా పన్ను కట్టలేదు. ప్రోపబ్లిక్ లీక్ చేసిన డేటాపై శ్వేతసౌధ ప్రతినిధి స్పందించారు. లీకేజీ అక్రమమైందన్నారు. ఎఫ్బీఐతో పాటు ఆదాయశాఖ అధికారులు ఆ అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారన్నారు.
ప్రోపబ్లికా సైట్ ప్రకారం అమెరికాకు చెందిన 25 మంది సంపన్నులు తమ ఆదాయంలో సగటును 15.8 శాతం మాత్రమే పన్ను రూపంలో చెల్లిస్తున్నట్లు పేర్కొన్నది. ఫోర్బ్స్ మ్యాగ్జిన్ ఇచ్చిన డేటా ఆధారంగా ప్రోపబ్లికా అంచనాలు వేసింది. 25 మంది సంపన్న అమెరికన్ల ఆదాయం 2014 నుంచి 2018 మధ్య కాలంలో 401 బిలియన్ డాలర్లు పెరిగింది. కానీ వాళ్లు కేవలం 13.6 బిలియన్ల డాలర్లు పన్ను రూపంలో చెల్లించినట్లు ఆధారాలు ఉన్నాయి. సాధారణ పౌరుల తరహాలోనే సూపర్ రిచ్ అమెరికన్లు కూడా పన్ను మినహాయింపులు కోరుతున్నట్లు తేలింది. అయితే అధ్యక్షుడు జో బైడెన్ సంపన్న అమెరికన్లపై ఆదాయ పన్ను వసూళ్ల శాతాన్ని పెంచాలని భావిస్తున్న తరుణంలో ఈ డేటా లీక్ కావడం గమనార్హం. మౌళికసదుపాయాలను పెంచేందుకు ధనవంతుల నుంచి అధిక పన్ను వసూల్ చేయాలని ఆయన ప్రణాళిక రచించారు. అమెరికాలో గొప్ప దాతగా పేరున్న జార్జ్ సోరస్ కూడా అతి తక్కువ ట్యాక్స్ కడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

