Sudan | సూడాన్‌లో దయనీయంగా మహిళల పరిస్థితి.. ఆహారం కోసం సైనికులతో బలవంతంగా శృంగారం
యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సూడాన్‌లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆహారం కోసం వారు బలవంతంగా సైనికులతో శృంగారంలో పాల్గొనాల్సి వస్తున్నట్టు ‘గార్డియన్' పత్రిక వెల్లడించింది.
Sudan | ఖార్టూమ్, జూలై 22: యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సూడాన్‌లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆహారం కోసం వారు బలవంతంగా సైనికులతో శృంగారంలో పాల్గొనాల్సి వస్తున్నట్టు ‘గార్డియన్’ పత్రిక వెల్లడించింది. తమ కుటుంబాల పోషణ కోసం ఆహారాన్ని లేదా సరుకులను పొందాలంటే సైనికుల కామవాంఛలను తీర్చడం మినహా మరో మార్గం లేకపోయిందని ఒండుర్మన్ నగరం నుంచి పారిపోయి వచ్చిన రెండు డజన్ల మందికిపైగా మహిళలు వాపోయినట్టు పేర్కొన్నది.
ఒండుర్మన్ నగరంలో ఆహార నిల్వలున్న దాదాపు అన్ని కర్మాగారాల్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపింది. ‘ఎంతో వృద్ధులైన నా తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆహార సేకరణ కోసం నా కుమార్తెను ఎన్నడూ బయటికి పంపలేదు. అందుకు బదులుగా నేనే సైనికుల వద్దకు వెళ్లా. ఆహారాన్ని పొందేందుకు ఇంతకంటే వేరే గత్యంతరం లేకపోయింది’ అంటూ ఓ మాంసం శుద్ధి కర్మాగారం వద్ద బలవంతంగా సైనికులతో శృంగారంలో పాల్గొన్న ఓ మహిళ కన్నీటిపర్యంతమైనట్టు ‘గార్డియన్’ వివరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Food
- soldiers
- Sudan
- Women Forced
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

