Imran Khan: మా నాన్న బ్రతికున్న ఆధారాలు చూపండి.. డిమాండ్ చేసిన ఇమ్రాన్ ఖాన్ కుమారుడు
Imran Khan: తన తండ్రి బ్రతికే ఉన్నాడన్న ఆధారాలు చూపాలని, తక్షణమే ఆయన్ను రిలీజ్ చేయాలని ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిమ్ ఖాన్ డిమాండ్ చేశారు. తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. తన తండ్రిని 845 రోజులుగా నిర్బంధించారని ఆ పోస్టులో ఖాసిమ్ పేర్కొన్నాడు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) జైలులో చనిపోయినట్లు పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు స్పందించారు. తన తండ్రి బ్రతికే ఉన్నాడన్న ఆధారాలు చూపాలని, తక్షణమే ఆయన్ను రిలీజ్ చేయాలని ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిమ్ ఖాన్ డిమాండ్ చేశారు. తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. తన తండ్రిని 845 రోజులుగా నిర్బంధించారని ఆ పోస్టులో ఖాసిమ్ పేర్కొన్నాడు.ఇక గడిచిన ఆరు వారాల నుంచి ఇమ్రాన్‌ను డెత్ సెల్లో వేశారని, ఫ్యామిలీతో అతను కాంటాక్ట్‌లో లేడని తెలిపారు.
కోర్టు ఆదేశాలు జారీ చేసినా.. సోదరీమణులను కలుసుకునేందుకు అడియాలా జైలు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఖాసిమ్ ఆరోపించారు. ఫోన్ కాల్స్ లేవని, విజిటర్స్ లేరని, అతని ఆరోగ్యం గురించి కూడా ఎటువంటి సమాచారం లేదన్నారు. తన తండ్రి పరిస్థితిని కావాలని అధికారులు కప్పిపుచ్చుతున్నారని, అధికారులదే పూర్తి బాధ్యత అవుతుందన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవాలని ఖాసిమ్ అభ్యర్థించాడు.
میرے والد کو گرفتار ہوئے 845 دن ہو چکے ہیں۔ پچھلے چھ ہفتوں سے انہیں مکمل بے خبری کے ماحول میں ڈیتھ سیل میں تنہا رکھا گیا ہے۔ ان کی بہنوں کو ہر ملاقات سے روک دیا گیا ہے حالانکہ عدالت کے واضح احکامات موجود ہیں۔ کوئی فون کال نہیں، کوئی ملاقات نہیں اور زندگی کی کوئی خبر نہیں۔ میں اور… pic.twitter.com/c0dhujWiSO
— Kasim Khan (@Kasim_Khan_1999) November 27, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

