ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని, తక్షణమే విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ పీటీఐ పార్టీ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు ప్రాంగణంలో ఇమ్రాన్‌ను నిర్బంధించడం దేశ న్యాయ వ్యవస్థకు తీవ్రమైన అగౌరవాన్ని కలిగించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నేషనల్ అకౌంటబుల్ బ్యూరో కోర్టు ధిక్కరణకు పాల్పడిందని సీజేపీ బండియల్ అన్నారు. ఒక వ్యక్తి కోర్టుకు హాజరయ్యారంటే లొంగిపోయినట్టేనని, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు.