కీవ్‌లోనే ఉన్నానంటూ లొకేషన్ షేర్ చేసిన జెలెన్స్కీ
పుతిన్ నేతృత్వంలోని రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ను విడిచి తాను ఎక్కడికీ వెళ్లలేదని మరోమారు పునరుద్ఘాటించారు. ఈ సారి తాను ఎక్కడుంటున్నారో ఆ లొకేషన్‌ను కూడా షేర్ చేసి, సవాల్ విసిరారు. నేను కీవ్‌లోని బంకోవా స్ట్రీట్‌లో వుంటున్నాను. నేనేమీ దాక్కొనలేదు. ఎవ్వరికీ భయపడేదే లేదు అంటూ జెలెన్స్కీ తేల్చి చెప్పారు. మనం దేశం కోసం యుద్ధం చేస్తున్నాం. దేశం గెలవడం కోసం మనం ఏమైనా చేయాలి అంటూ ఉక్రెయిన్ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు.
తన టేబుల్‌పైన కూర్చొని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ వీడియోను విడుదల చేశారు. మనం యుద్ధం చేస్తూనే వున్నాం. ఇవ్వాళ్టికి 12 వ రోజు. మనమందరమూ యుద్ధ భూమిలోనే ఉన్నాం. అందరమూ పని చేస్తూనే వున్నాం. నేను కీవ్‌లోనే ఉన్నాను. నా టీమ్ కూడా నాతోనే వుంది. రష్యాకు వ్యతిరేకంగా మాతృభూమి కోసం యుద్ధం చేస్తున్న జవాన్లందరికీ నా కృతజ్ఞతలు. కచ్చితంగా మనం గెలిచి తీరుతాం అంటూ జెలెన్స్కీ ఆ వీడియోలో పేర్కొన్నారు.
తాను ఉక్రెయిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లలేదని అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం ఇది మూడో సారి. గతంలో రెండు సార్లు ఇదే విధమైన ప్రకటన చేశారు. అధ్యక్షుడు జెలెన్స్కీ దేశంలో లేరని, దేశం విడిచి వెళ్లిపోయారని మొదట్లో రష్యా ఆరోపించింది. రెండోసారి కూడా రష్యా ఇదే విధమైన ఆరోపణలు చేసింది. అధ్యక్షుడు జెలెన్స్కీ ఉక్రెయిన్‌లో లేరని, పోలాండ్‌లో శరణార్థిగా ఉంటున్నారని రష్యా పేర్కొంది. అప్పుడు తాను ఉక్రెయిన్‌లోనే వున్నానని, ఎక్కడికీ వెళ్లలేదని జెలెన్స్కీ ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

