అరుదైన ఘనత.. ప్రపంచంలోనే టాప్ రీసెర్చ్ యూనివర్సిటీ ఐఐఎస్సీ

న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే టాప్ రీసెర్చ్ యూనివర్సిటీగా నిలిచింది. బుధవారం రిలీజ్ చేసిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. ఇక ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ టాప్ 200 యూనివర్సిటీల్లో చోటు దక్కించుకోగా.. ఇండియాలో బెస్ట్ కాలేజీలుగా తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. ఐఐటీ గౌహతికి కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కడం విశేషం.
సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ సూచిక ఆధారంగా ఐఐఎస్సీకి ఈ టాప్ ప్లేస్ దక్కింది. లండన్‌కు చెందిన క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) రూపొందించిన ఈ మెట్రిక్‌లో ఐఐఎస్సీకి 100కు 100 మార్కులు రావడం విశేషం. ఇక టాప్ యూనివర్సిటీ ర్యాంకుల్లో ఐఐఎస్సీకి 186వ స్థానం దక్కింది. ఇండియాలో ఐఐటీ బాంబే, ఢిల్లీ తర్వాత మూడో బెస్ట్ యూనివర్సిటీగా ఐఐఎస్సీ నిలిచింది.
ఐఐటీ బాంబే తాజా ర్యాంకుల్లో 177వ స్థానం సంపాదించింది. ఈసారి కూడా ఇండియాలో బెస్ట్ కాలేజ్‌గా నిలిచినా.. గతేడాది 172వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే.. ఈసారి ఐదు ర్యాంకులు కోల్పోయింది. అటు ఐఐటీ ఢిల్లీ మాత్రం 193వ స్థానం నుంచి 185కు ఎగబాకింది. ఈ క్రమంలో ఐఐఎస్సీని వెనక్కి నెట్టింది.
మిగతా ఐఐటీల విషయానికి వస్తే ఐఐటీ మద్రాస్ 20 స్థానాలు ఎగబాకి 255కు చేరింది. ఐఐటీ ఖరగ్‌పూర్ 280, ఐఐటీ గౌహతి 395 ర్యాంకుల్లో నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్ తొలిసారి టాప్ 600లోకి తొలిసారి వచ్చింది. 591-600 మధ్య ర్యాంకు సాధించింది. ప్రధానంగా ఆరు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను కేటాయించారు. ప్రపంచంలోని టాప్ 1300 యూనివర్సిటీల జాబితాను ఈసారి రిలీజ్ చేశారు.
ఇక వరల్డ్ టాప్ యూనివర్సిటీగా వరుసగా పదోసారీ మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ రెండు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు మూడో స్థానంలో ఉన్నాయి. భారతీయ యూనివర్సిటీలు ఈసారి కొన్ని కేటగిరీల్లో మెరుగైన ప్రదర్శన చేసినా.. ఫ్యాకల్టీ/స్టూడెంట్ రేషియోలో మాత్రం టాప్ 250లో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

