వాషింగ్టన్: అమెరికా రచయిత, ఉపన్యాసకురాలు, ఫెమినిస్ట్ గ్లోరియా ైస్టెనమ్(92) బుధవారం కన్నుమూశారని ఆమె ఫౌండేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. లింగ సమానత్వం కోసం, మహిళల పౌర, పునరుత్పత్తి హక్కుల కోసం అయిదు దశాబ్దాల పాటు ఆమె పోరాడారు. మిస్ మ్యాగజైన్ సహ వ్యవస్థాపకులు, కన్సల్టింగ్ ఎడిటర్ అయిన ఆమె.. 1971లో మాజీ అమెరికా ప్రతినిధులు బెల్లా అబ్జగ్, షెర్లీ చిస్హోల్మ్, బెట్టి ఫ్రిడన్తో కలిసి మహిళల రాజకీయ బృందాన్ని స్థాపించారు.