నాటో సభ్యదేశంగా స్వీడన్!
రెండేండ్ల సుదీర్ఘ చర్చల అనంతరం నాటోలో స్వీడన్ సభ్యత్వం పొందటానికి మార్గం సుగమమైంది. ఇందుకు చివరి అడ్డంకిగా ఉన్న హంగేరి పార్లమెంట్ ఆమోదించటంతో సమస్య పరిష్కారమైంది.
- తొలగిన చివరి అడ్డంకి
- హంగేరి పార్లమెంట్ ఆమోదం
బుడాపెస్ట్: రెండేండ్ల సుదీర్ఘ చర్చల అనంతరం నాటోలో స్వీడన్ సభ్యత్వం పొందటానికి మార్గం సుగమమైంది. ఇందుకు చివరి అడ్డంకిగా ఉన్న హంగేరి పార్లమెంట్ ఆమోదించటంతో సమస్య పరిష్కారమైంది. సోమవారం హంగేరి పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో స్వీడన్‌కు అనుకూలంగా 188 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో హంగేరి మిత్ర దేశాలు రెండేండ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. 2022 జులైలో హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బన్ ప్రభుత్వం స్వీడన్ ప్రవేశాన్ని ఆమోదించటానికి ప్రొటోకాల్ సమర్పించింది. దీన్ని పాలక పక్ష సభ్యులు వ్యతిరేకించటంతో ప్రతిష్టంభన ఏర్పడింది.
కొత్త దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వాలంటే సభ్యదేశాలు ఏకగ్రీవంగా మద్దతు తెలపాలి. 31 మంది సభ్యదేశాలున్న నాటో కూటమిలో గత నెలలో తుర్కియే తన ఆమోదం తెలుపగా.. చివరిగా హంగేరి మద్దతు అవసరం పడింది. ఓటింగ్‌కు ముందు చట్టసభ సభ్యులనుద్దేశించి ఓర్బన్ మాట్లాడుతూ స్వీడన్, హంగేరిల సైనిక సహకారం, స్వీడన్ నాటో ప్రవేశం హంగేరి భద్రతను బలోపేతం చేస్తాయన్నారు. శుక్రవారం స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ హంగేరి రాజధానిలో ఆ దేశ ప్రధాని ఓర్బన్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్టు ప్రకటించారు. స్వీడన్ నాటో బిడ్ ఆమోదాన్ని అధికారికంగా ఆమోదించటానికి అధ్యక్ష సంతకం అవసరం.. ఇది త్వరలో జరుగుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

