న్యూఢిల్లీ: కాబోయే భార్యకు నిలువెత్తు బంగారాన్ని బహుమానంగా ఇచ్చాడు ఓ యువకుడు. ఆ నగలన్నింటినీ ధరించి పెండ్లి మంటపంలోకి వచ్చిన ఆ వధువును చూసి బంధువులంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అంత బరువుతో ఆమెకు నడవడానికి కూడా కష్టమైంది. వరుడే సాయం చేశారు. సెప్టెంబర్ 30న చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఈ వివాహం జరిగింది. వధువు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.