రష్యా దగ్గర ఎన్ని.. నాటో దగ్గర ఎన్ని అణు బాంబులున్నాయి?
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పుతిన్ ఇచ్చిన సంకేతాలు కొన్ని దేశాలను భయపట్టిస్తున్నాయి. కానీ ఇంతకీ రష్యా దగ్గర ఎన్ని అణు బాంబులు ఉన్నాయో తెలుసా. అమెరికా సైంటిస్టుల ఫెడరేషన్ ప్రకారం రష్యా వద్ద 5977 అణ్వాయుధాలు ఉన్నాయి. అణు విస్పోటనం చెందే ఆ బాంబుల్లో సుమారు 1500 బాంబులు పనిచేయవని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక మిగిలిన 4500 అణ్వాయుధాల్లో.. చాలా వరకు స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అంటే బాలిస్టిక్ మిస్సైళ్లు, రాకెట్లు. వీటిని సుదూర లక్ష్యాలను చేధించేందుకు వినియోగిస్తారు. న్యూక్లియర్ వార్‌లో ఇలాంటి ఆయుధాలను ఎక్కువగా వాడుతారు.
రష్యా వద్ద ప్రస్తుతం 1185 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, 800 సబ్‌మెరైన్ మిస్సైళ్లు, 580 ఎయిర్ లాంచర్ న్యూక్లియర్ బాంబర్లు ఉన్నాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా ప్రస్తుతం 1500 వార్‌హెడ్స్‌ను ఎక్కుపెట్టినట్లు తెలుస్తోంది. మిస్సైల్ లేదా బాంబర్ లేదా సబ్‌మెరైన్ బేస్‌ల వద్ద ఆ అణ్వస్త్రాలను సిద్ధం చేసి ఉంచారు. చైనా, ఫ్రాన్స్, ఇండియా, ఇజ్రాయిల్, నార్త్ కొరియా, పాకిస్థాన్, రష్యా, అమెరికా, బ్రిటన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి.
ఇక నాటో దేశాల వద్ద 5943 అణ్వాయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాకు ధీటుగా నాటో దేశాల వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. దీంట్లో అమెరికా వద్ద 5428, ఫ్రాన్స్ వద్ద 290, బ్రిటన్ వద్ద 225 అణు బాంబులు ఉన్నాయి. చైనా వద్ద 350, పాకిస్థాన్ వద్ద 165, ఇండియా వద్ద 160, ఇజ్రాయిల్ వద్ద 90, నార్త్ కొరియా వద్ద 20 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

