Artemis II: చంద్రుడిని చేరేందుకు ఎంత టైం పడుతుంది? ఆ నలుగురు వ్యోమగాములెవరు?
Artemis II: ఆర్టెమిస్2 చంద్రుడిని చేరాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? నాసా అంచనా ప్రకారం ఏప్రిల్ ఆరో తేదీన ఆర్టెమిస్2 చంద్రుడిని చుట్టేస్తుంది. గతంలో అపోలో 8 మూడు రోజుల్లోనే జాబిలిని చేరింది. ఇక ఆ నలుగురు వ్యోమగాములెవరో తెలుసుకుందాం.
ఫ్లోరిడా: ఆర్టెమిస్-2(Artemis II) సిబ్బంది ఇవాళ నింగికి ఎగిరారు. చంద్రుడిని చుట్టి వచ్చేందుకు నలుగురు వ్యోమగాములు ఆ మిషన్‌లో భాగస్వాములైనారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ఎగిరింది. ప్రస్తుతం భూమికి 45 వేల మైళ్ల దూరంలో ఆర్టెమిస్ ఉన్నది. అయితే నాసా శాస్త్రవేత్తల ప్రకారం ఏప్రిల్ ఆరో తేదీన ఆర్టెమిస్ చంద్రుడిని సర్కిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం 2022లో ఆర్టెమిస్-1 రోదసిలోకి వెళ్లింది. ఆ మిషన్‌లో వ్యోమగాములు లేరు. కానీ చంద్రుడి వద్దకు చేరుకునేందుకు ఆర్టెమిస్-1కు ఆరు రోజుల సమయం పట్టింది. ఇక అతి త్వరగా చంద్రుడిని చేరిన స్పేస్‌క్రాఫ్ట్‌లో అపోలో 8 నిలుస్తుంది. చంద్రుడి వద్దకు ఆ వ్యోమనౌక కేవలం మూడు రోజుల్లోనే చేరింది. కచ్చితంగా చెప్పాలంటే కేవలం 69 గంటలు 8 నిమిషాల్లో అపోలో 8 చంద్రుడిని చేరింది. జాబిలి వద్దకు అన్మాన్డ్ ఆబ్జెక్ట్స్ వేగంగా చేరుకోగలవు. నాసాకు చెందిన న్యూ హారిజన్ ప్రోబ్ .. కేవలం 8 గంటలు 35 నిమిషాల్లోనే చంద్రుడిని దాటేసింది. 2006లో ప్లూటో గ్రహం మీదకు ఈ మిషన్‌ను పంపించారు. వాస్తవానికి ఆ ప్రోబ్ లూనార్ ఆర్బిట్ దగ్గరకు వెళ్లలేదు. కానీ ఆ దూరాన్ని దాటేసింది.
ఆర్టెమిస్-2 ప్రాజెక్టులో రీడ్ వైజ్మాన్ మిషన్ కమాండర్‌గా ఉన్నారు. ఆయన మాజీ అమెరికా నేవీ పైలెట్. 2009లో నాసా ఆస్ట్రోనాట్ అయ్యారు. 2014లో సుమారు 165 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. ఇక ప్రస్తుతం ఆర్టెమిస్ షిప్‌కు పైలట్‌గా విక్టర్ గ్లోవర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన నవంబర్ 2020 నుంచి మే 2021 వరకు స్పేస్ స్టేషన్లో ఉన్నారు. స్పేస్ఎక్స్ క్రూ-1లో పైలెట్‌గా చేశారు. మూన్ మిషన్‌లో పాల్గొన్న తొలి నల్లజాతి ఆస్ట్రోనాట్‌గా ఆయన నిలుచారు. అతనికి మూడు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి. మిషన్ స్పెషలిస్టుగా క్రిస్టినా కోచ్ ఉన్నారు. అంతరిక్షంలో 328 రోజులు గడిపిన మహిళగా ఆమెకు రికార్డు ఉన్నది. 2013లో ఆమె ఆస్ట్రోనాట్ అయ్యారు. చంద్రుడి వద్దకు ప్రయాణిస్తున్న తొలి మహిళ ఆమె కానున్నది. ఈ మిషన్‌లో మరో స్పెషలిస్టుగా జెర్మీ హన్సెన్ ఉన్నారు. చంద్రుడి వద్దకు వెళ్తున్న తొలి కెనడా వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. గతంలో ఓ నాసా ప్రాజెక్టు కోసం అతను ఏడు రోజుల పాటు అండర్‌వాటర్‌లో గడిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Artemis II
- Astronauts
- Moon
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

