Houthi Rebals | ఎర్ర సముద్రం ( Red Sea)లో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. ఎర్రసముద్రం మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ (Gulf of Aden)లో అమెరికా జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ (US flagged oil tanker) నౌక ఎంవీ టార్మ్ థార్పై మిస్సైళ్లతో దాడి ( fire missiles) చేశారు. ఈ దాడి ఘటనలో ట్యాంకర్ నౌకకు కానీ, సిబ్బందికి గానీ ఎలాంటి నష్టం జరగలేదు.
Also Read..
Alexei Navalny | గుండెపై ఒకే పంచ్.. కేజీబీ పాత పద్ధతి ద్వారా నావల్నీ హత్య..?
Drug Racket | భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. పరారీలో సినీ నిర్మాత
Indian Journalist | న్యూయార్క్లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్ట్ మృతి