హాంకాంగ్, డిసెంబర్ 14: కాలేయ క్యాన్సర్ సోకి చివరి దశలో ఉన్నా, నయం చేసే చికిత్సను హాంకాంగ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీ కలిపి క్యాన్సర్ కణితులను రూపుమాపేలా చేసే చికిత్సను యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
తాము అభివృద్ధి చేసిన ఈ చికిత్సతో 65 ఏండ్ల వ్యక్తిని చివరి దశ నుంచి క్యాన్సర్ తొలి దశకు తగ్గించామని వర్సిటీ ప్రొఫెసర్ అల్బర్ట్ చాన్ చియాన్ తెలిపారు. స్టేజ్-4 నుంచి స్టేజ్-1కు తీసుకొచ్చామని వివరించారు.