ఉక్రెయిన్‌లో షూటింగ్‌కు వెళ్లి.. నడుచుకుంటూ బోర్డర్ దాటిన హాలీవుడ్ హీరో
కీవ్: హాలీవుడ్ హీరో, ఆస్కార్ విన్నర్ సీన్ పెన్.. ఉక్రెయిన్‌లో షూటింగ్ కోసం వెళ్లి తెగ ఇబ్బందులుపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ గురించి డాక్యుమెంటరీ తీసేందుకు కీవ్‌కు వెళ్లిన 61 ఏళ్ల సీన్ పెన్ ఆ నగరం నుంచి బయటపడేందుకు కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కీవ్‌ను రష్యా సేనలు ముట్టడి చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. సీన్ పెన్ తన సూట్‌కేస్‌లతో ఆ నగరం నుంచి వలస బాట పట్టారు. బ్యాక్‌ప్యాక్, లగేజీతో ఆ హీరో.. పోలాండ్ బోర్డర్ దిశగా వెళ్లారు.
ఓ దగ్గర ట్రాఫిక్ జామ్ కావడంతో.. తన కారును అక్కడే వదిలేసి పోలాండ్ బోర్డర్‌కు కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లారు. పెన్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే క్షేమంగానే సీన్ పెన్ ఉక్రెయిన్ వీడినట్లు ఆయన అనుచరులుతెలిపారు. మిస్టిక్ రివర్, మిల్క్ చిత్రాల్లో నటించిన సీన్ పెన్కు ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఇన్ టు ద వైల్డ్, ద క్రాసింగ్ గార్డ్ చిత్రాలకు ఆయన డైరెక్టర్‌గా చేశారు. హరికేన్ కత్రినా, హైతీ భూకంపం, పాకిస్థాన్ వరదల సమయంలో సీన్ పెన్ రిలీఫ్ వర్క్‌లో పాల్గొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

