హిజ్బుల్ ముజాహిద్దీన్ కీలక కమాండర్ హత్య..
hizbul mujahideen | జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కీలక కమాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. హిజ్బుల్ కీలక కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ అలమ్‌ను పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కీలక కమాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. హిజ్బుల్ కీలక కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ అలమ్‌ను పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కొత్తగా నియామకం అయ్యే ఉగ్రవాదులను కశ్మీర్‌కు తరలించడంలో బషీర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బషీర్‌ను ఐదు నెలల క్రితమే కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది.
అయితే బషీర్ ఇస్లామాబాద్‌లోని రావాల్పిండి ఏరియాలో ఫిబ్రవరి 20వ తేదీన ఓ దుకాణం ముందు నిల్చొని ఉండగా, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి పరారీ అయ్యారు. దీంతో బషీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బషీర్ స్వస్థలం ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని బద్ర్పోరా. బషీర్ 2000 సంవత్సరం నుంచి పాక్‌లో ఉంటూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడు. కుప్వారా ప్రాంతంలో జరిగే చొరబాట్లు, ఇతర ఉగ్రసంస్థలతో సమన్వయం చేసుకుంటూ బషీర్ దాడులకు పాల్పడేవాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

