Hindu Temple Demolished | పాక్‌లో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ ఆలయం కూల్చివేత..
Hindu Temple Demolished | పాకిస్థాన్ కరాచీలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఈ ఘటనతో పాక్‌లోని హిందూ సమాజం భయాందోళనకు గురవుతున్నది. సమాచారం ప్రకారం.. కరాచీలోని సోల్జర్ బజార్లో మారిమాత ఆలయం ఉన్నది.
Hindu Temple Demolished | పాకిస్థాన్ కరాచీలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఈ ఘటనతో పాక్‌లోని హిందూ సమాజం భయాందోళనకు గురవుతున్నది. సమాచారం ప్రకారం.. కరాచీలోని సోల్జర్ బజార్లో మారిమాత ఆలయం ఉన్నది. దాదాపు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఈ ఆలయానికి ఉన్నది. అయితే, షాపింగ్ ప్లాజా నిర్మించేందుకు గత శుక్రవారం గుర్తు తెలియని బిల్డర్ ఆలయాన్ని కూల్చివేశారు. ఆలయ భూమిని షాపింగ్ ప్లాజా ప్రమోటర్‌కు రూ.7కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ ఆలయాన్ని పోలీసుల సమక్షంలో బూల్డోజర్ల సహాయంతో కూల్చివేసినట్లు తెలుస్తున్నది.
గతేడాది జూన్‌లో మారిమాత ఆలయంలోని దేవతా విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారని పంచ్‌ముఖి హనుమాన్ మందిర్ కేర్‌టేకర్ రామ్‌నాథ్ మిశ్రా మహారాజ్ తెలిపారు. ఆలయం కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఆలయాన్ని కూల్చివేశారని, ప్రహరి, ప్రధాన ద్వారాన్ని వదిలేసి.. లోపలి నిర్మాణాన్ని కూల్చివేశారన్నారు. ఈ ఆలయాన్ని దాదాపు 150 ఏళ్ల కిందట నిర్మించారని, దాని ప్రాంగణం కింద నిధి ఉన్నట్లు కథలు చెప్పుకునేవారని పేర్కొన్నారు. అయితే, సుమారు 400-500 చదరపు గజాల విస్తీర్ణంలోని భూకబ్జాదారులు కన్నేశారన్నారు. అయితే, ఆలయాన్ని ప్రమాదకరమైన కట్టడమని అధికారులు ప్రకటించడంతో కూల్చివేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఆలయాన్ని కరాచీలోని మద్రాసీ హిందూ సమాజం నిర్వహిస్తోంది. ఆలయ నిర్మాణం చాలా పురాతనమైందని, ఆలయ నిర్వాహకులు అయిష్టంగానే తాత్కాలికంగా దేవతా విగ్రహాలను చిన్న గదిలోకి తరలించి.. అక్కడ కొన్ని పునర్నిర్మాణ పనులు చేపట్టారని ఆయన తెలిపారు. అయితే, ఆ స్థలంలో వాణిజ్య భవనాన్ని నిర్మించాలని భావించి నకిలీ పత్రాలతో భూమిని డెవలపర్‌కు కొందరు విక్రయించారు. దాంతో సదరు వ్యక్తుల ఆలయ భూమిని ఖాళీ చేయాలని సదరు వ్యక్తులు నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారని హిందూ సంఘం నేత రమేశ్ తెలిపారు. ఇక్కడి హిందూ సమాజం హిందూ కౌన్సిల్, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా, సింధ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్‌కు విజ్ఞప్తి చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. పాకిస్తాన్లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

