Pakistan | కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు
పాకిస్థాన్‌లో (Pakistan) హిందువులే (Hindus) లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. కరాచీలో (Karachi) ప్రముఖ హిందూ డాక్టర్‌ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (KMC) ఆఫ్ హెల్త్ మాజీ డైరెక్టర్, కంటి స్పెషలిస్ట్ డాక్టర్ బీర్బల్ జెనాని (Dr Birbal Genani) తన అసిస్టెంట్ డాక్టర్‌తో కలిసి కరాచీలోని రామ్స్వామీ నుంచి గుల్షన్-ఈ-ఇక్బాల్ ప్రాతానికి కారులో వస్తున్నారు.
కరాచీ: పాకిస్థాన్‌లో (Pakistan) హిందువులే (Hindus) లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. కరాచీలో (Karachi) ప్రముఖ హిందూ డాక్టర్‌ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (KMC) ఆఫ్ హెల్త్ మాజీ డైరెక్టర్, కంటి స్పెషలిస్ట్ డాక్టర్ బీర్బల్ జెనాని (Dr Birbal Genani) తన అసిస్టెంట్ డాక్టర్‌తో కలిసి కరాచీలోని రామ్స్వామీ నుంచి గుల్షన్-ఈ-ఇక్బాల్ ప్రాతానికి కారులో వస్తున్నారు. ఈ క్రమంలో లయారీ (Layari) ఎక్స్‌ప్రెస్‌వే వద్ద కారును అడ్డగించిన దుండగులు.. ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో బీర్బల్ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన సహాయకురాలైన మహిళా డాక్టర్ తీవ్రంగా గాయపడ్డారు.

Hindudoctor 1
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డాక్టర్‌ను దవాఖానకు తరలించారు. డాక్టర్నే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నదని పోలీస్ అధికారి ఆరీఫ్ అజీజ్ చెప్పారు. దుండగులను గుర్తించేందుకు సీసీ టివీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కాగా, గతవారం దేశంలోని హిందూ వ్యాపారులను వెధించారు. వారు రంజాన్ ఆర్డినెన్స్‌ను అతిక్రమించారని, నిబంధనలకు విరుద్ధంగా తింటున్నారని పోలీసులు పలువురు వ్యాపారులపై దాడులకు పాల్పడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

