నేపాల్ అధ్యక్షురాలికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
Bidhya Devi Bhandari: నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ (61) అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను హుటాహుటిన రాజధాని ఖాట్మండులోని
ఖాట్మండు: నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ (61) అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను హుటాహుటిన రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. విద్యాదేవి భండారీ శుక్రవారం నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని, శనివారం సమస్య మరింత తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేర్పించామని ఆమె సెక్రెటరీ భేష్ రాజ్ అధికారి తెలిపారు.
ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారని, రిపోర్టులు రావాల్సి ఉందని భేష్ రాజ్ చెప్పారు. విద్యాదేవి భండారి నేపాల్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలు. అంతేగాక వరుసగా రెండు పర్యాయాలు దేశాధ్యక్ష పదవికి ఎంపికైన వ్యక్తిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. ఆమె మొదటిసారి 2015లో దేశాధ్యక్షురాలు కాగా, 2018లో మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆమె పదవీకాలం పూర్తికానుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

