విద్వేషాన్ని ఆపండి : జో బైడెన్

జార్జియా: విద్వేషానికి వ్యతిరేకంగా గళం వినిపించాలని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ పిలుపునిచ్చారు. మన మౌనం సమస్యను మరింత జఠిలం చేస్తుందని ఆయన అన్నారు. మూడు రోజుల క్రితం అట్లాంటాలో ఆసియా అమెరికన్లపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 8 మంది మృతిచెందారు. దాంట్లో ఆరుగరు ఆసియా మహిళలే ఉన్నారు. ఈ నేపథ్యంలో జార్జియాలో పర్యటించిన బైడెన్.. ఆసియా అమెరికన్ నేతలను కలివారు. కోవిడ్ మహమ్మారి వేళ ఈస్ట్ ఏషియా దేశాల వారిపై విద్వేష దాడులు పెరిగాయని, వర్ణవివక్ష మన దేశాన్ని చాన్నాళ్లుగా పీడిస్తోందని, ఆ మంటల్ని ఆర్పేందుకు అమెరికన్లు ప్రయత్నించాలని బైడెన్ అన్నారు. కరోనా మహమ్మారికి ఆసియన్లే కారణమన్న ఉద్దేశంతో శ్వేతజాతీయులు.. ఆసియా అమెరికన్లపై దాడులు చేస్తున్నారు. గత ఏడాది నుంచి అమెరికాలో సుమారు మూడు వేలకు పైగా దాడులు జరిగాయి. విద్వేషం అమెరికాను సురక్షితంగా ఉంచదని, దాన్ని ఆపాలని బైడెన్ అన్నారు. అందరం కలిసి దాన్ని అడ్డుకోవాలన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Asian American
- Hate
- Joe Biden
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

