Watch: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం దారుణం… కదులుతున్న కారును తొక్కేసిన ట్యాంక్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సైన్యం పాల్పడుతున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యుద్ధం మూడో రోజుకు చేరగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా సైనిక దళాలు దూసుకెళ్తున్నాయి. అయితే రష్యాకు చెందిన ఒక ట్యాంక్ నిర్మాణుష్య ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న కారుపైకి వేగంగా దూసుకెళ్లింది. వెనక్కి వెళ్లి మరి దానిని బలంగా తొక్కేసింది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తి మరణించి ఉంటాడని భావించి ముందుకు సాగిపోయింది.
అనంతరం స్థానికులు వెంటనే ఆ కారు వద్దకు వచ్చారు. మిలిటరీ ట్యాంక్ తొక్కేయడంతో నుజ్జైన కారులో చిక్కుకున్న డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడిన ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకున్నాడు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పార్లమెంట్ భవనానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగినట్లు స్కై న్యూస్ తెలిపింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ ప్రాంతాన్ని గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రష్యా సైనికుల దురాగతంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Za sve one koji ne žele da vide šta Putin radi u Ukrajini.
Ruski narod ne stoji iza ovoga. Ovo je Putinov lični rat.
Na obraz medjunarodnoj zajednici koja ovo nemo posmatra.#Ukraine pic.twitter.com/aqfhpMuX9A
— Balša Božović 🇺🇦🇨🇦🇩🇰 (@Balshone) February 25, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

